Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 17, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఏపీ స్థానిక ఎన్నికల్లో BCలకు 34% రిజర్వేషన్లు.. హైకోర్టు తీర్పు రిజర్వ్!
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది.
ఈ సందర్భంగా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నియామక ఉత్తర్వులు, కమిషన్ సమర్పించిన పూర్తి నివేదికను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వీటితో పాటు రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను కూడా సమర్పించాలని స్పష్టం చేసింది.
ప్రభుత్వం అందజేసే ఈ నివేదికలు, సర్వే సమాచారాన్ని సమగ్రంగా పరిశీలించిన అనంతరమే ఈ కేసులో తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని న్యాయస్థానం పేర్కొంది.



